: టీమిండియా 199/5


ధర్మశాల వేదికగా ఆడుతున్న తొలి టీట్వంటీ మ్యాచ్ లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన భారత జట్టుకు రోహిత్ శుభారంభం ఇచ్చాడు. ధావన్ (3), కోహ్లీ (43) అండతో కేవలం 62 బంతుల్లోనే 12 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ చేసిన రోహిత్ (106) భారీ షాట్ కు యత్నంచి అవుటయ్యాడు. దీంతో మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన రెండో భారతీయ బ్యాట్స్ మన్ గా రోహిత్ నిలిచాడు. అనంతరం ధాటిగా ఆడే ప్రయత్నంలో రైనా (12) పెవిలియన్ చేరాడు. వెంటనే రాయుడు (0) సాధ్యం కాని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ గా పెవిలియన్ చేరాడు. అనంతరం అక్షర్ పటేల్ (2) అండతో ధోనీ (20) స్కోరు బోర్డును డబుల్ సంచరీ అంచుకుతెచ్చాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో అబాట్ రెండు, మోరిస్ ఒక వికెట్ తీసి రాణించారు. అనంతరం 200 పరుగుల విజయ లక్ష్యంతో సౌతాఫ్రికా బ్యాటింగ్ ప్రారంభించింది.

  • Loading...

More Telugu News