: టాస్ గెలిచిన సౌతాఫ్రికా...టీమిండియా బ్యాటింగ్
ధర్మశాల వేదికగా హెచ్ పీసీఏ స్టేడియంలో భారత్-సౌతాఫ్రికా మధ్య మరికాసేపట్లో ప్రారంభం కానున్న మహాత్మా గాంధీ-నెల్సన్ మండేలా ద్వైపాక్షిక సిరీస్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచింది. బీసీసీఐ ప్రధాన కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ టాస్ కాయిన్ ను ఆవిష్కరించగా, ధర్మశాలలో ఇరు దేశాల జాతీయ గీతాలతో ఇరు జట్ల ఆటగాళ్లు పేటీఎం టీట్వంటీ ట్రోఫీని ఆవిష్కరించారు. టాస్ గెలిచిన సఫారీలు భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించారు. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ బ్యాటింగ్ ప్రారంభించారు. కాగా, సౌతాఫ్రికా జట్టు కేల్ అబ్బోట్ తో బౌలింగ్ దాడి ఆరంభించింది. స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది.