: నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం : రిటైర్ట్ ఏసీపీ దుర్మరణం


నల్గొండ జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పంజాగుట్టకు చెందిన రిటైర్డ్ ఏసీపీ రాంరెండ్డి, కానిస్టేబుల్ మృతి చెందగా, పది మంది గాయపడ్డారు. ఈ సంఘటన వివరాలు.. చింతపల్లి మండలం కుర్మెడ వద్ద నాగార్జునసాగర్ నుంచి హైద్రాబాద్ వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరొకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మితిమీరిన వేగంతో రెండు కార్లు వెళ్తుండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు.

  • Loading...

More Telugu News