: బీహార్ లో భారీగా పట్టుబడుతున్న నగదు


బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు రూ.12.17 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. గతేడాది లోక్ సభ ఎన్నికల సమయంలో ఒక్క బీహార్ నుంచే రూ.6 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. దాంతో పోలీస్తే ఈసారి అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెట్టింపు నగదు పట్టుబడిందని చెప్పారు. దాంతో పాటు రూ.60.30 లక్షల విదేశీ కరెన్సీ, రూ.58.12 లక్షల నేపాలీ కరెన్సీ, రూ.13.22 లక్షల భారత కరెన్సీ నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికలకు సంబంధించిన లావాదేవీల నిర్వహణ కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను తెరవాలని అధికారులు సూచించారు.

  • Loading...

More Telugu News