: 'దివాళా తెలంగాణ' ఘనత కేసీఆర్ దే: టీటీడీపీ అధ్యక్షుడు రమణ


తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు మిగులు రాష్ట్రంగా ఉందని, ఇప్పుడు దివాళా తీసిందని అన్నారు. కేసీఆర్ సర్కార్ 16 నెలల్లోనే రూ.62 వేల కోట్ల అప్పులు తెచ్చిందన్నారు. టీఆర్ఎస్ పరిపాలన సవ్యంగా లేకపోవడం వల్లే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. రైతు ఆత్మహత్యలు లేకుండా సాధ్యమయ్యేది మళ్లీ రామరాజ్యం వచ్చినప్పుడేనని, అది తాము తీసుకువస్తామని రమణ ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News