: అది బీఫ్ కాకపోతే నా తండ్రిని తెచ్చిస్తారా?: హంతకులకు బాధితురాలి సవాల్


తమ నివాసంలో దొరికినది బీఫ్ కాదని నిర్ధారణ అయితే, తన తండ్రిని తనకు తెచ్చి ఇస్తారా? అని హిందూ వాదులను మృతుడి కుమార్తె సాజిదా ప్రశ్నిస్తున్నారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీకి 45 కిలోమీటర్ల దూరంలోని దుసారా గ్రామంలో గోమాంసం తిన్నాడన్న ఆరోపణలతో మహ్మద్ అఖ్ లాఖ్ (52) అనే వ్యక్తిని ఇంట్లోంచి బయటకు ఈడ్చుకుని వచ్చి హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అడ్డువచ్చిన అతని కుమారుడు డానిష్ (20)ను కూడా తీవ్రంగా గాయపరిచారు. దీనిపై మృతుడి కుమార్తె ఆవేదన వ్యక్తం చేసింది. కుట్రతో పుకార్లను రేపి, తన తండ్రిని హత్య చేశారని పేర్కొంది. తన సోదరుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడం వల్ల వదిలేశారని లేకుంటే అతనిని కూడా చంపేసి ఉండేవారని ఆమె అభిప్రాయపడింది. తన తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని, తన సోదరుడినైనా బతికించాలని సాజిదా వేడుకుంటోంది. కాగా, ఈ ఘటనలో ఆరుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News