: జాగృతి స్వచ్ఛంద సంస్థో, ప్రభుత్వంలో భాగమో ఎంపీ కవిత చెప్పాలి!: టి.టీడీపీ అధికార ప్రతినిధి
తెలంగాణ జాగృతి సంస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు జాగృతి స్వచ్ఛంద సంస్థో లేక ప్రభుత్వంలో భాగమో ఎంపీ కవిత చెప్పాలని టి.టీడీపీ అధికార ప్రతినిధి రజనీకుమారి నిలదీశారు. బతుకమ్మ పండుగ నిర్వహణపై ఏ హోదాలో కవిత కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్ ను నిన్న(గురువారం) కలసిన కవిత, భారతిని కూడా కలసి బతుకమ్మ పండుగకు ఆహ్వానించడంపై స్పందించారు. కేసీఆర్, జగన్ కుటుంబాల మధ్య అవగాహనను భారతి-కవిత భేటీ మరోసారి రుజువు చేసిందన్నారు. జగన్ పార్టీకి ఒక సిద్ధాంతమే లేదని రజనీకుమారి విమర్శించారు.