: ఆలస్యంగా నిద్రపోతున్నారా!.. అయితే లావైపోతారు జాగ్రత్త!
సెకండ్ షో సినిమాలు, వీడియో గేమ్ లు, ఇంటర్నెట్ బ్రౌజింగ్ లేదా ఇతర వ్యాపకాలతో రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రపోతున్నారా, అయితే లావయిపోతారు జాగ్రత్త. ఈ విషయాన్ని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు. అమెరికాలో సుమారు 3,300 మందిపై వారు పరిశోధన నిర్వహించారు. ప్రతిరోజు రాత్రి ఆలస్యంగా నిద్రపోయే వ్యక్తుల ఆకృతిలో ఐదేళ్లలో స్పష్టమైన తేడా కనిపించిందట. వారు కోల్పోయిన ప్రతి గంట నిద్రకు బదులుగా బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) సూచిలో 2.1 పాయింట్లు పెరిగిన విషయం ఆ పరిశోధనలో తేలింది. త్వరగా నిద్రకు ఉపక్రమిస్తే.. బరువు పెరగకుండా ఉండటమే కాదు ఆరోగ్యం కూడా మన సొంతమవుతుందని పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.