: తెలంగాణను వ్యతిరేకించిన జగన్ కుటుంబాన్ని ఆహ్వానిస్తారా?: కవితపై కొత్తకోట ఫైర్
టీఆర్ఎస్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై టీటీడీపీ ప్రధాన కార్యదర్శి కొత్తకోట దయాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణను వ్యతిరేకించిన వైకాపా అధినేత జగన్ కుటుంబాన్ని బతుకమ్మ పండుగకు ఎలా ఆహ్వానిస్తారని మండిపడ్డారు. తెలంగాణ సాధన కోసం అప్పట్లో అన్ని పార్టీలు ఏకమై పోరాడాయని... ఇప్పుడు రైతుల ఆత్మహత్యలపై కూడా అలాగే పోరాడుతాయని చెప్పారు. రైతుల పక్షాన నిలవడానికి విపక్షాలన్నీ ఏకమైతే కేసీఆర్ కు అంత బాధ ఎందుకని ప్రశ్నించారు.