: టాలీవుడ్ యంగ్ హీరోపై న్యూసెన్స్ కేసు


టాలీవుడ్ యంగ్ హీరోలు ర్యాష్ డ్రైవింగ్ ను వీడట్లేదు. ఖరీదైన కార్లలో రద్దీగా ఉండే హైదరాబాదు రోడ్లపై దూసుకెళుతున్న హీరోలు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా యంగ్ హీరో తనీశ్ పైనా ఈ తరహాలో ఓ న్యూసెన్స్ కేసు నమోదైంది. నిన్న రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో తన కారులో వేగంగా దూసుకువచ్చిన తనీశ్ ముందు వెళుతున్న స్కూటరిస్టును ఢీకొట్టాడు. ఆ తర్వాత తన కారును ఆపకుండానే వెళ్లిపోయాడు. ఈ క్రమంలో బాధితుడు తనీశ్ కారును వెంబడించి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద నిలిపేశాడు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రంగప్రవేశం చేసిన పోలీసులు తనిశ్ తో పాటు స్కూటరిస్టుపైనా న్యూసెన్స్ కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News