: ‘ఫీజు’ కోసం బయట నిలబెట్టిన పాఠశాల... సెల్పీలో బాధ వ్యక్తం చేసి విద్యార్థి సూసైడ్
సకాలంలో ఫీజు చెల్లించలేదని ఆ విద్యార్థిని పాఠశాల యాజమాన్యం బయటే నిలబెట్టింది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ విద్యార్థి ఎలాగోలా రూ.5 వేలు కట్టాడు. అయినా పాఠశాల యాజమాన్యం సంతృప్తి చెందలేదు. మొత్తం ఫీజు చెల్లించాల్సిందేనని పట్టుబట్టింది. ఈ క్రమంలో ఇక డబ్బులు సర్దుబాటు కావని భావించిన ఆ విద్యార్థి పాఠశాల యాజమాన్యం కఠిన వైఖరితో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పాఠశాల యాజమాన్యం తనపై వ్యవహరించిన తీరుతో పాటు, తన కుటుంబ ఆర్థిక స్థితిగతులను స్వయంగా చెబుతూ ఓ సెల్పీ వీడియో తీశాడు. దానిని స్నేహితులకు పంపి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో సంతోష్ రెడ్డి అనే విద్యార్థి బలవన్మరణం చెందాడు.