: టర్కీలో దూసుకెళ్లిన బస్సు... 12 మంది మృతి


టర్కీలోని అంకారాలో ఓ బస్సు అదుపు తప్పి ప్రయాణికులపై దూసుకెళ్లిన సంఘటనలో 12 మంది మృతి చెందారు. బస్టాప్ ఎదుట నిలబడిన ప్రయాణికుల్లో పన్నెండు మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News