: టీఆర్ఎస్ ఎంపీ కవిత చిత్రపటానికి క్షీరాభిషేకం!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ జిల్లా ఎంపీ కవిత చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో తెలంగాణ జాగృతి సంస్థ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాగృతి నాయకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు భరోసాగా ఉంటామని తమ సంస్థ తరపున కవిత చేసిన ప్రకటనతో సర్వత్ర హర్షం వ్యక్తమవుతోందన్నారు. అన్నదాతల ఆత్మహత్యలను ఆపాలనే నిశ్చయంతో సుమారు 100 కుటుంబాలను దత్తత తీసుకోవడమే కాకుండా, తన ఏడాది వేతనాన్ని ఎంపీ కవిత విరాళంగా అందజేయడం ఆమె దాతృత్వానికి నిదర్శనమన్నారు.