: వారు గెలిస్తే ఇక అరాచకమే: జైట్లీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ (యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో ఏర్పడిన లౌకిక కూటమి గెలిస్తే అరాచకం రాజ్యమేలుతుందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. పాట్నాలో ఎన్డీయే విజన్ డాక్యుమెంట్ విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోని మధ్యప్రదేశ్ ఎలాంటి ప్రగతి సాధించిందో అలాటి ప్రగతి కావాలంటే బీహార్ లో బీజేపీ విజయం సాధించాలని అన్నారు. ఐదు విడతల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వాలని ఆయన ఓటర్లకు సూచించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి బీజేపీ కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.