: టీఆర్ఎస్ పసిగుడ్డు కాదు... వాటర్ గ్రిడ్ లోనే వేల కోట్ల కుంభకోణానికి పాల్పడింది: ఉత్తమ్ కుమార్


టీఆర్ఎస్ పార్టీ పసిగుడ్డు కాదని, వాటర్ గ్రిడ్ పథకంలోనే వేల కోట్ల కుంభకోణానికి తెరలేపిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. వాటర్ గ్రిడ్ కుంభకోణంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. కమిషన్లు తీసుకుని రూ. 15 వేల కోట్లను ఒకే కంపెనీకి కట్టబెట్టారని విమర్శించారు. ఒక కంపెనీకి మేలు చేసేలా వాటర్ గ్రిడ్ టెండర్లు పిలిచారని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్యను కూడా తగ్గించి చూపారని మండిపడ్డారు. రుణమాఫీ వన్ టైమ్ సెటిల్ మెంట్ చేస్తామని చెబుతున్నారని... ఎప్పటిలోగా చేస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News