: కార్యరంగంలోకి దిగిన లోకేశ్... విజయవాడలో కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం


పార్టీలో కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త పోస్టు నుంచి ప్రమోషన్ లభించిన టీడీపీ యువనేత, పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేశ్ కార్యరంగంలోకి దూకేశారు. పార్టీలో స్పష్టమైన పదవంటూ లేని సమయంలోనే ఆయన రాష్ట్రం నలుమూలలా పర్యటనలు చేశారు. తాజాగా పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టిన లోకేశ్, పదవి అందిన మరునాడే ప్రత్యక్ష కార్యరంగంలోకి దిగిపోయారు. కొద్దిసేపటి క్రితం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పురోభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై ఆయన కార్యకర్తలతో చర్చిస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News