: బంగారు బతుకమ్మ పోస్టర్ ను ఆవిష్కరించిన కల్వకుంట్ల కవిత


తెలంగాణలో మరోమారు బతుకమ్మ సందడికి తెరలేచింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత బంగారు బతకుమ్మ పోస్టర్, సీడీలను ఆవిష్కరించారు. వరుసగా తొమ్మిదో ఏట రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహిస్తామని ఆమె ప్రకటించారు. అంతేకాక ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ నెల 12 నుంచి మొదలయ్యే వేడుకలను తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు చివరి రోజైన ఈ నెల 20న హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై బతుకమ్మ వేడుకలను జరపనున్నట్లు వెల్లడించారు. బతుకమ్మ వేడుకల పేరిట జరిగిన కార్యక్రమాల్లో నిధులు దుర్వినియోగమయ్యాయని వచ్చిన ఆరోపణలపై ఆమె ఘాటుగా స్పందించారు. ఉద్యమ సమయంలో మహిళలను ఒక్కదరికి చేర్చేందుకు బతుకమ్మ వేడుకలు తొడ్పడ్డాయన్నారు. బతుకమ్మ వేడుకల లెక్కలు కావాలంటే ‘జాగృతి’ వెబ్ సైట్ లో ఉన్నాయని, వాటిని ఎవరైనా పరిశీలించుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News