: విచారణకు హాజరుకావాలని అగ్రిగోల్డ్ ఛైర్మన్ కు ఆదేశం


అగ్రిగోల్డ్ మోసాలపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. అమరావతి పరిధిలోని 2 ఆస్తులు వేలం వేసుకోవచ్చని అగ్రిగోల్డ్ కోర్టుకు తెలిపింది. అయితే సీఆర్ డీఏ పరిధిలో ఆస్తుల వేలానికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందని, ఆ ఆస్తులకు సమాన విలువ కలిగిన మరో 2 ఆస్తులు చూపాలని ఆదేశించింది. ఈ క్రమంలో భూముల విలువల వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణకు అగ్రిగోల్డ్ ఛైర్మన్ హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ క్రమంలో ఆ రోజున ఈ కేసులో కోర్టు తీర్పు వెలువరిస్తుందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News