: చీపురు పట్టనున్న చంద్రబాబు... రేపటి నుంచి వారం పాటు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్


స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చీపురు పట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ తరహాలో చంద్రబాబు ‘స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’కు శ్రీకారం చుడుతున్నారు. రేపటి నుంచి వారం పాటు ఏపీ వ్యాప్తంగా పరిశుభ్రతా వారోత్సవాలకు ఏపీ సర్కారు కార్యాచరణ రూపొందించింది. నగరాల నుంచి గ్రామాల వరకు వారం పాటు ఉవ్వెత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. రేపు లాంఛనంగా ప్రారంభం కానున్న స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా గుంటూరులో జరిగే కార్యక్రమంలో చంద్రబాబు స్వయంగా పాలుపంచుకోనున్నారు. ఈ కార్యక్రమాలపై నేటి ఉదయం ఆయన వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా అధికార యంత్రాంగంతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

  • Loading...

More Telugu News