: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై కీలక చర్చ... మరికాసేపట్లో బెజవాడలో ఏపీ కేబినెట్ భేటీ
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఆ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశంలో నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణంపై కీలక చర్చ జరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నెల 22న విజయదశమి పర్వదినం సందర్భంగా అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లతో పాటు నిర్మాణ బాధ్యతలను ఏ కంపెనీకి అప్పజెప్పాలన్న అంశంపైనా ఈ భేటీలో చర్చ జరగనుంది. ఇక రాజధాని కోసం భూములిచ్చిన రైతుల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై కూడా చంద్రబాబు మరోమారు దృష్టి సారించనున్నారు.