: సెల్పీ తీసిన చేతులతోనే కాల్చేశాడు
వాళ్లిద్దరూ లవర్స్.. ముచ్చటపడి సెల్ఫీ తీసుకున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది ప్రియురాలు. అంతే, ఆ తర్వాత ప్రియురాలి జాడలేదు. అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. ప్రియుడే హతుడని తేలింది. ఈ సంఘటన అమెరికాలోని ఆర్కన్సాన్ లో జరిగింది. లిటిల్ నార్త్ రాక్ ప్రాంతానికి చెందిన రఫెల్ గాన్జలెజ్, స్టెఫానీ హెర్నాండెజ్ లు కొంతకాలంగా ప్రేమికులు. గత ఆదివారం వాళ్లిద్దరూ సెల్ఫీ దిగారు. ఆ ఫొటోలను అప్ లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే హెర్నాండెజ్ కనపడలేదు. దీంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు ఒక ఇంట్లో హెర్నాండెజ్ మృతదేహం కనపడింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులకు హెర్నాండెజ్ తలకు రఫెల్ గన్ పెట్టినట్లుగా కనపడింది. ఈ రెండు కారణాలతో రఫెల్ హత్య చేసి ఉంటాడని భావించిన పోలీసులు అతన్ని విచారణ చేశారు. సెల్ఫీ దిగిన కొద్ది గంటల తర్వాత హెర్నాండెజ్ ను హత్య చేసినట్లు రఫెల్ ఒప్పుకోవడంతో అతన్ని అరెస్టు చేశారు.