: రెండు రోజులు చర్చించినా ఉపయోగం లేదు: ఎర్రబెల్లి
రైతు ఆత్మహత్యలపై శాసనసభలో రెండు రోజులు చర్చించినప్పటికీ ఏ విషయంలోనూ ప్రభుత్వం స్పష్టతనివ్వలేకపోయిందని టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రైతులకు ఊరట కల్పించేలా ప్రభుత్వం కరవు మండలాలను కూడా ప్రకటించలేదని అన్నారు. అలాగే రుణమాఫీపై కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని ఆరోపించారు. రైతు రుణమాఫీ లక్ష రూపాయలను ఏకకాలంలో చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కష్టాల్లో ఉన్న తెలంగాణ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం నడుం బిగించాలని ఆయన సూచించారు.