: కేంద్రంలా మేము రైతులను అవమానించలేదు: హరీష్ రావు


రైతు ఆత్మహత్యలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిలా తాము అవమానకరంగా మాట్లాడలేదని తెలంగాణ మంత్రి హరీష్ రావు తెలిపారు. రైతు ఆత్మహత్యలపై చర్చ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తోందని అన్నారు. రైతు ఆత్మహత్యలపై రెండు రోజులు చర్చ చేపట్టడమే అందుకు నిదర్శనమని ఆయన తెలిపారు. 'రైతు ఆత్మహత్యలకు కారణం నపుంసకత్వం' అంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ లా తాము రైతులను అవమానించలేదని అన్నారు. దీంతో బీజేపీ సభ్యులు అభ్యంతరం చెప్పారు. హరీష్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శాసనసభలో కాసేపు గందరగోళం నెలకొంది.

  • Loading...

More Telugu News