: రేపటి నుంచి లారీ యజమానుల దేశవ్యాప్త సమ్మె


రేపటి నుంచి లారీ యజమానుల దేశ వ్యాప్త నిరవధిక సమ్మె జరగనుంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ లారీ యజమానులు ఈ సమ్మెకు పిలుపునిచ్చారు. గడువు తీరిన టోల్ గేట్లు ఎత్తివేయాలని అఖిల భారత లారీ యజమానుల సంఘం డిమాండ్ చేసింది. అంతేకాకుండా లారీ యజమానుల నుంచి టీడీఎస్ పన్ను వసూలు రద్దు చేయాలని, తెలుగు రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆ సంఘం డిమాండ్ చేసింది. ఈ సమ్మెకు తెలుగు రాష్ట్రాల లారీ యజమానుల సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా లారీ యజమానులు మాట్లాడుతూ చెక్ పోస్టు వద్ద అక్రమ వసూళ్లను నిరసిస్తున్నామని రేపు జరిగే సమ్మెలో పాల్గొంటామని అన్నారు. లారీ యజమానుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు వారు విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ సమ్మెతో రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 16 లక్షలకు పైగా సరుకు రవాణా వాహనాలు నిలిచిపోనున్నాయి. దీంతో నిత్యావసరాలు, సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం పడనుంది.

  • Loading...

More Telugu News