: బుసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో 'బాహుబలి' ప్రదర్శన
భారీ బడ్జెట్ లో రూపొందిన 'బాహుబలి' చిత్రాన్ని దక్షిణకొరియాలోని బుసాన్ లో ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు. పది రోజుల పాటు జరిగే ఈ అతిపెద్ద ఫిలిం ఫెస్టివల్ లో అక్టోబర్ 4,7,11 తేదీల్లో బాహుబలిని ప్రదర్శిస్తారు. ఇప్పటికే ఈ సినిమా చైనాలో విడుదలైన సంగతి తెలిసిందే.