: చిరుతో 150వ సినిమా తీసే హక్కు నాకే ఉంది: పూరీ జగన్నాథ్


ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తో చిరంజీవి 150వ సినిమా పూర్తిగా అటకెక్కినట్టేనంటూ ఈ మధ్య కాలంలో వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. దీనిపై పూరీ జగన్నాథ్ ట్విట్టర్లో స్పందించాడు. చిరంజీవితో 150వ సినిమా తీసే హక్కు తనకే ఉందని అన్నాడు. ఎందుకంటే అందరికంటే తానే చిరంజీవికి పెద్ద ఫ్యాన్ నని చెప్పాడు. చిరంజీవి తెర మీద ఎలా ఉంటే బావుంటుందో ఫ్యాన్స్ కి మాత్రమే తెలుసని పూరీ అన్నాడు. తాను చెప్పిన కథ ఆయనకు నచ్చకపోతే, ఇంకో కథ తయారు చేస్తానని, అదీ నచ్చకపోతే మరో కథ తయారు చేస్తానని, ఆయనకు కథ నచ్చేవరకు తయారు చేస్తానని పేర్కొన్నాడు. చిరంజీవితో సినిమా తీయడమే తన లక్ష్యమని పూరీ స్పష్టం చేశాడు. 150వ సినిమా కాకపోతే 151వ సినిమా... మొత్తానికి ఆయనతో సినిమా తీస్తానని పూరీ తెలిపాడు. దీనిపై మెగాస్టార్ ఎలా స్పందిస్తారు చూడాలి!

  • Loading...

More Telugu News