: రైతులకు భరోసా కల్పించాలి: జానారెడ్డి


రైతులకు ధైర్యమిచ్చేలా ప్రభుత్వ చర్యలు ఉండాలని, వారికి భరోసా కల్పించాలని శాసనసభలో ప్రతిపక్షనేత జానారెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలు, సమస్యలపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఈ రోజు ఆయన మాట్లాడారు. ఒక అటెండర్ కు వస్తున్న ఆదాయం కూడా నేడు రైతుకు రావడం లేదన్నారు. రాష్ట్రంలో 80 శాతం మంది రైతులు రూ.లక్ష లోపు రుణాలు ఉన్నవారేనని, రుణమాఫీ వల్ల ఎక్కువ మందికి లాభం చేకూరాలన్నారు. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) ద్వారా రూ.3 వేల కోట్ల వరకు వస్తాయన్న దానిపై కూడా ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వం చేస్తున్న పనులకు తమ వంతు సహకారం ఉంటుందని జానారెడ్డి అన్నారు.

  • Loading...

More Telugu News