: ఆ విషయం చంద్రబాబుకు బాగా తెలుసు: జేసీ


నిత్యమూ తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కాంగ్రెస్ మాజీ నేత, ప్రస్తుత అనంతపురం తెదేపా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి అదే విధమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందా? రాదా? అన్న విషయం చంద్రబాబునాయుడికి బాగా తెలుసునని, అయితే, ఆయన తన మనసులోని విషయాన్ని అంత త్వరగా బయటపెట్టే వ్యక్తి కాదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలకు సైతం, విషయం తెలుసునని, వారు కూడా దాన్ని బయట పెట్టేందుకు ఇష్టపడటం లేదని అన్నారు. "మరి మీరు అసలు విషయం చెప్పవచ్చు కదా?" అన్న మీడియా ప్రశ్నకు సమాధానమిస్తూ, తాను ఎన్నోసార్లు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పానని, ఇప్పుడు ఇంకోసారి చెబితే, మరో రెండు రోజులు ఇదే విషయాన్ని మీరు ప్రసారం చేస్తారని అన్న జేసీ, జవాబు చెప్పకుండా తప్పించుకున్నారు.

  • Loading...

More Telugu News