: ఐదుగురికి మరణ శిక్ష... ముంబై పేలుళ్ల కేసులో శిక్షలు ఖరారు


2006లో మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించిన కేసులో శిక్షలు ఖరారయ్యాయి. ముంబై రైళ్లలో వరుసగా చోటుచేసుకున్న బాంబు పేలుళ్లకు సంబంధించి మొత్తం 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేరాభియోగాల అనంతరం సుదీర్ఘ కాలం పాటు విచారణ చేపట్టిన ముంబై కోర్టు కొద్దిసేపటి క్రితం తుది తీర్పు వెలువరించింది. నిందితుల్లో ఐదుగురికి మరణ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సంచలన తీర్పు వెలువరించారు. మరో ఏడుగురు నిందితులకు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేశారు. ఈ తీర్పునకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News