: మిగతా పార్టీల నేతలు కూడా ఆస్తులు ప్రకటించాలని చంద్రబాబు సవాల్
ఇటీవల ప్రకటించిన తన ఆస్తులపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. దమ్ముంటే మిగతా పార్టీల నేతలు కూడా వారి ఆస్తులను ప్రకటించాలని సవాల్ చేశారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఈ మేరకు చంద్రబాబు మాట్లాడారు. ఆస్తులు తమకు సంక్రమించిన సమయంలో ఉన్న విలువనే బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తామని, అంతేగానీ ఎప్పటికప్పుడు పెరిగి, తరిగే విలువ బ్యాలెన్స్ షీట్ లో ఉండదని చెప్పారు. ఇది కూడా తెలుసుకోకపోవడం దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. తెలివి తక్కువగా మాట్లాడొద్దని విపక్షాలను హెచ్చరించారు.