: పిల్లనిచ్చిన మామ 'పెళ్లి'కి సుందర్ పిచాయ్ అభినందనలు!
గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ సొంత మామ ఓలారామ్ హర్యానీ తన 70 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నారు. కోటా లోని పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేసి పదవీ విరమణ అనంతరం ముంబైలో ఉంటున్న ఓరారామ్, 65 ఏళ్ల మాధురీ శర్మను ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నారు. ఓలారామ్ కు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. కుమార్తె అంజలి, సుందర్ పిచాయ్ సతీమణి. కాగా, ప్రతి ఒక్కరికీ, తన జీవితాన్ని తనకు నచ్చినట్టు మలచుకునే హక్కు ఉందని వివాహం తరువాత ఓలారామ్ వ్యాఖ్యానించగా, ఆయనకు అభినందనలు తెలుపుతున్నట్టు సుందర్ పిచాయ్ వెల్లడించారు.