: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై రామ్ గోపాల్ వర్మ తీవ్ర వ్యాఖ్యలు


ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో మరోసారి చెలరేగాడు. ఈ సారి పవన్ కల్యాణ్ అభిమానులను వర్మ టార్గెట్ చేశాడు. ట్విట్టర్ లో మహేశ్ బాబుకు 15 లక్షల మంది ఫాలోయర్లు ఉండగా, పవన్ కు కేవలం 6 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారని అన్నాడు. ఒకవేళ పవన్ కాస్తంత లేట్ గా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశాడనుకుంటే... ఒక సూపర్ స్టార్ ఫాలోయర్ల సంఖ్య తక్కువ కాలంలోనే అమాంతం పెరగాలి కదా? అని ప్రశ్నించాడు. చివరకు హీరోయిన్ సమంతను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా 10 లక్షలు ఉందని అన్నాడు. తాను పవన్ కల్యాణ్ కు అతి పెద్ద ఫ్యాన్ అని... మహేశ్ కన్నా పవన్ కు తక్కువ ట్విట్టర్ ఫాలోయర్లు ఉండటం తనను బాధిస్తోందని వర్మ కామెంట్ చేశాడు. దీనికి కారణం, పవన్ అభిమానుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులు అయినా అయ్యుండాలి, లేదా టెక్నాలజీపై అవగాహన లేనివారైనా అయ్యుండాలని అన్నాడు. ఈ సందర్భంగా పవన్ అభిమానులకు ఓ సలహా కూడా ఇచ్చాడు. సమావేశాలను నిర్వహించుకొని, టెక్నీలజీపై అవగాహన కలిగేలా ఒకరికొకరు సహకరించుకోవాలని సూచించాడు. మహేశ్ బాబుకు ఉన్న 15 లక్షల ఫాలోయర్లను అందుకోవడానికి పవన్ కు 2018 వరకు సమయం పడుతుందని... ఆలోగా మహేశ్ ఫాలోయర్ల సంఖ్య 45 లక్షలకు చేరుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కల్యాణ్ అడుగుతున్నాడని... కానీ, పవన్ తన అభిమానులను ట్విట్టర్ గురించి తెలుసుకునేలా మొదట అభివృద్ధి చేయాలని సూచించాడు.

  • Loading...

More Telugu News