: సినిమాల్లో ఇక చేజింగ్ సీన్లు కనిపించవా?... రద్దు దిశగా టీ రవాణా శాఖ యోచన
సినిమాల్లో రోమాలు నిక్కబొడుచుకునేలా సాగే ‘చేజింగ్’ సీన్లు ఇకపై కనిపించే అవకాశాలు లేవు. ఎందుకంటే, హీరోల విరోచిత విన్యాసాలకు ఆకర్షితులవుతున్న యువత ట్రాఫిక్ నిబంధనలను తుంగలో తొక్కుతోంది. ఈ కారణంగా పెద్ద సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒక్కోసారి మరణాలూ సంభవిస్తున్నాయి. హైదరాబాదు పరిధిలో తరచూ కనిపిస్తున్న ఈ తరహా ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ రవాణా శాఖ దృష్టి సారించింది. యువతను విశేషంగా ఆకట్టుకుంటున్న సినిమా చేజింగ్ సీన్లను రద్దు చేయడం ద్వారా ర్యాష్ డ్రైవింగ్ కు అడ్డుకట్ట పడుతుందని ఆ శాఖ భావిస్తోంది. ఈ మేరకు సినిమాల్లో ఇకపై చేజింగ్ సీన్లకు కట్ చేప్పే దిశగా ప్రభుత్వం ప్రత్యేకంగా మార్గదర్శకాలను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోందట.