: మావోయిస్టుల ప్రోద్బలంతోనే ఛలో అసెంబ్లీ: డీసీపీ కమలాసన్ రెడ్డి
మావోయిస్టుల ప్రోద్బలంతోనే వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయని హైదరాబాదు నగర డీసీపీ కమలాసన్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, చలో అసెంబ్లీ కార్యక్రమానికి మావోయిస్టులు వస్తారనే సమాచారం ఉందని అన్నారు. ఛలో అసెంబ్లీ మావోయిస్టు సిద్ధాంతాలకు మద్దతుగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వరంగల్ ఎన్ కౌంటర్ కు నిరసనగా ప్రజాసంఘాలు చేపట్టిన చలో అసెంబ్లీకి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. మరోపక్క, అనుమతి ఇచ్చినా, ఇవ్వకున్నా ఛలో అసెంబ్లీ నిర్వహిస్తామని ప్రజా సంఘాలు తెలిపిన సంగతి తెలిసిందే.