: గ్రామాల దత్తతకు రెస్పాన్స్ బాగుంది : ఏపీ సీఎం చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామాల దత్తతకు మంచి రెస్పాన్స్ వస్తోందని, చాలామంది ముందుకు వస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో మున్సిపల్ స్టేడియంలో ‘రైతు కోసం చంద్రన్న’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామాలను దత్తత తీసుకున్న వారందరితో విజయవాడలో వచ్చేనెలలో సమావేశం నిర్వహిస్తామన్నారు. దత్తత తీసుకున్న గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమంపై చర్చించనున్నట్లు చెప్పారు. ప్రతి నెలలో ఒకరోజు సమాజ సేవ కోసం కేటాయించాలని కోరారు. ఇక స్వచ్ఛ భారత్ ను ఉద్యమ స్ఫూర్తితో ముందుకు నడిపించాలని, ఇది అమలయ్యాక రాష్ట్రాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉండే వ్యక్తులను తీసుకుని స్వచ్ఛ భారత్ పై ప్రచారం చేస్తామన్నారు. ముఖ్యంగా మరుగుదొడ్ల విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. డ్వాక్రా మహిళల గురించి మాట్లాడుతూ వారికి మధ్యాహ్న భోజన పథకం అప్పగించామని, చెట్ల పెంపకం బాధ్యత కూడా వారికే ఇచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News