: బురఖాలో వెళుతుంది..గిటార్ వాయిస్తుంది!
బ్రెజిల్ కు చెందిన ఆ యువతి పేరు గిసేలి మారీ. ఆమె క్రిస్టియన్. 2009 లో మారీ తండ్రి మరణించాడు. ఆ తర్వాత ఆమె ముస్లిం మతంలోకి మారింది. అప్పటి నుంచి బురఖా ధరించడం అలవాటు చేసుకుంది. మరి.. గిటార్ కథేమిటంటే.. ఆమెకు గిటార్ వాయించడమంటే చాలా ఇష్టం. అందుకోసం, తన సోదరులు స్థాపించిన ‘స్పెక్ట్స్’ అనే బ్యాండ్ లో చేరింది. వాళ్లతో పాటు గిటార్ క్లాసులకు హాజరైంది. ఆ బ్యాండ్ లో గిటారిస్ట్ గా చేరింది. గిటార్ వాయించడంలో బాగా నైపుణ్యం సంపాదించింది. ఎక్కడ, ఏ కార్యక్రమానికి గిటార్ వాయించే ఆహ్వానం అందినా బురఖాలోనే వెళుతుంది. ప్లే చేస్తుంది. ఈ బురఖా గిటారిస్టును కొంతమంది వింతగా చూస్తుంటే, మరికొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మాత్రం ఇవేవీ తాను పట్టించుకోనని, సంగీతం కావాల్సిన వాళ్లకు తన వేషధారణతో పనేముందని గిసేలి అంటోంది.