: నాపై సానుభూతి ఉంది...అందుకే ఆ ప్రచారం: రాజయ్య
వరంగల్ లోక్ సభ స్థానంలో స్థానికులను పోటీకి నిలపాలని టీఆర్ఎస్ శ్రేణులు కోరుకుంటున్నాయని తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య తెలిపారు. హైదరాబాదులో తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో ఆయన మాట్లాడుతూ, వరంగల్ పార్లమెంటు స్థానానికి పోటీ చేసే వ్యక్తి ఎవరనేది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ కు తప్ప మరెవరికీ తెలియదని అన్నారు. డిప్యూటీ సీఎం పదవి కోల్పోవడంతో తనపై రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి ఉందని ఆయన చెప్పారు. దీంతోనే టీడీపీ, బీజేపీ అభ్యర్థిగా వరంగల్ లో పోటీ చేస్తాననే ప్రచారం తెరపైకి వచ్చిందని ఆయన వెల్లడించారు. తాను టీఆర్ఎస్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ విడనాడేది లేదని ఆయన తెలిపారు.