: ఆటగాళ్లను గన్ తో బెదిరించిన రిఫరీ


బ్రెజిల్ లో ఫుట్ బాల్ మ్యాచ్ లో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. బ్రుమాండినో జట్టు అమాంటెస్ డ బోలా జట్టుతో ఆడుతుండగా దురుసుగా ఆడిన బ్రుమాండినో జట్టు సభ్యుడికి రెడ్ కార్డ్ చూపించాలని రిఫరీ గాబ్రీ ముర్తాను అమాంటెస్ డ బోలా ఆటగాళ్లు అడిగారు. వారి డిమాండ్ కు తలొగ్గని రిఫరీపై అమాంటెస్ డ బోలా ఆటగాళ్లు దాడి చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన రిఫరీ ఛేంజింగ్ రూంకి వెళ్లి, తుపాకీ తీసుకొచ్చి ఆటగాళ్లకు వార్నింగ్ ఇచ్చాడు. ఈ వ్యవహారం మొత్తం సీసీటీవీలో రికార్డయింది. దీంతో ఇది క్రీడా ప్రపంచంలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో రెఫరీ తీరు తీవ్ర విమర్శలకు కారణమైంది. దీంతో అతను క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోనున్నారు. కాగా, అమాంటెస్ డ బోలా సభ్యులు రిఫరీని కాళ్లతో తన్ని, చెంపపై కొట్టడంతో గన్ తీసుకొచ్చాడని లీగ్ నిర్వాహకులు తెలిపారు. ఆత్మరక్షణ కోసమే గాబ్రీ ముర్తా గన్ తీసుకొచ్చాడని రిఫరీస్ అసోసియేషన్ అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News