: జీవితంలో తొలిసారి నాతో ఫోటో దిగమని ఆమెను కోరా: అర్జున్ కపూర్


జీవితంలో తొలిసారి ఓ వ్యక్తిని తనతో ఫోటో దిగాల్సిందిగా కోరానని బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ తెలిపాడు. ఇంతకీ అంతటి ప్రముఖ వ్యక్తి ఎవరని అనుకుంటున్నారా? పాకిస్థాన్ కు చెందిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్. అమెరికాలోని న్యూయార్క్ లో గ్లోబల్ సిటిజన్ ఫెస్టివల్ జరిగింది. ఈ కార్యక్రమానికి మలాల, అర్జున్ కపూర్ హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన అనంతరం తనతో ఫోటో దిగాల్సిందిగా మాలాలాను అర్జున్ కపూర్ కోరాడు. దానికి సమ్మతించిన మలాలా, అర్జున్ తో ఫోటో దిగింది. దీనిని ట్విట్టర్లో పోస్టు చేస్తూ అర్జున్ కపూర్ ఈ విషయం తెలిపాడు.

  • Loading...

More Telugu News