: లాలూ బావగారికి కటీఫ్ చెప్పిన మరో బావమరిది!
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు మరో బావమరిది కూడా దూరమయ్యారు. సొంత బావమరిది సుభాష్ యాదవ్ ఆర్జేడీ పార్టీని వదిలి పప్పు యాదవ్ పార్టీ అయిన జన్ అధికార్ పార్టీలో(జేఏపీ) చేరారు. ఆయనతో పాటు జేడీయూ ఎమ్మెల్యే ఒకరు, ఎల్ జేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాలన్ సింగ్, పలువురు కాంగ్రెస్ జేడీయూ నేతలు కూడా పప్పూ యాదవ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. లాలూ సతీమణి రబ్రీదేవికి ఇద్దరు సోదరులున్నారు. గతంలో ఆమె మరో సోదరుడైన సాధు యాదవ్ కూడా ఆర్జేడీ నుంచి బయటకు వెళ్లిపోయారు.