: వార్మప్ మ్యాచ్ లో సౌతాఫ్రికా చిత్తు
వార్మప్ మ్యాచ్ లో భారత్ ఏ జట్టు సత్తాచాటింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై భారత 'ఏ' జట్టు కుర్రాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. దీంతో 8 వికెట్ల తేడాతో భారత 'ఏ' జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డుమిని అర్ధసెంచరీతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత ఏ జట్టుకు మయాంఖ్ అగర్వాల్ (83) శుభారంభం ఇచ్చాడు. అనంతరం వోహ్రా (56), సంజు శాంసన్ (31 నాటౌట్) ధాటిగా ఆడడంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే భారత ఏ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.