: వరంగల్ స్థానానికి వామపక్షాల అభ్యర్థిగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్
వరంగల్ లోక్ సభ స్థానానికి వామపక్ష పార్టీల తరపున పోటీచేసే అభ్యర్థి పేరు ఖరారైంది. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఉపఎన్నికల బరిలో తమ తరపున పోటీ చేస్తున్నట్టు వామపక్షాలు ప్రకటించాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా నియమితులవడంతో, అప్పటికే వరంగల్ ఎంపీ అయిన కడియం శ్రీహరి తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో త్వరలో ఉపఎన్నిక జరగనుంది. అంతకుముందు ప్రజాగాయకుడు గద్దర్ ను పోటీలో నిలపాలని వామపక్షాలు భావించినప్పటికీ ఆయన నిరాకరించిన విషయం తెలిసిందే.