: టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: నారా లోకేశ్
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయ కర్త నారా లోకేష్ కోరారు. కార్యకర్తలను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు 171 మంది కార్యకర్తలకు రూ.2 లక్షల చొప్పున ప్రమాద బీమా అందజేశామని తెలిపారు. 2వేల మంది కార్యకర్తల కుటుంబాలను వివిధ రూపాల్లో ఆదుకున్నామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో ఇవాళ నిర్వహించిన టీడీపీ కార్యకర్తల శిక్షణా శిబిరానికి లోకేశ్ హాజరయ్యారు. శిక్షణా శిబిరంలో ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యకర్త స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు శిక్షణ శిబిరాలుంటాయని చెప్పారు.