: వరంగల్ ఎన్ కౌంటర్ పై వివరాలు సమర్పించండి... టి.ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం


వరంగల్ జిల్లా తాడ్వాయి అటవీప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ పై సీబీఐతో విచారణ జరిపించాలని, చనిపోయిన మావోయిస్టులను అంతకుముందే తీవ్రంగా హింసించారని పిటిషనర్ తరపున వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో ఎన్ కౌంటర్ పై పోస్టుమార్టం నివేదికను సీల్డ్ కవర్ లో సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అంతేగాక రెండు వారాల్లోగా ఎన్ కౌంటర్ పై వివరాలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News