: నాగుపామును టీజ్ చేసిన పిల్లి... మీరూ చూడండి!
సుమారు ఐదడుగుల పొడవున్న నాగుపాము. దారితప్పి మనుషుల మధ్యకు వచ్చింది. దాన్ని చూసిన ప్రజలు భయంతోనో, భక్తితోనే వదిలేసిన వేళ, ఓ పిల్లి దాన్ని చూసింది. పాముతో కలబడింది. పాము కాటు వేయాలని చూసిన ప్రతిసారీ ఒడుపుగా తప్పించుకుంటూ, తన పంజాతో కొడుతూనే వుంది. పామును ఓ బొమ్మ మాదిరి భావిస్తూ, అటూ ఇటూ నెడుతూ ఆడుకుంది. కొన్ని నిమిషాల పాటు జరిగిన పాము, పిల్లి పోరును ఓ యువకుడు మొబైల్ లో చిత్రీకరించగా, ఇప్పుడా పిల్లి సామాజిక మాధ్యమాల్లో హీరో అయింది. ఈ పోరును టీవీ చానళ్లు కూడా ప్రముఖంగా చూపాయి. మీరూ చూడండి.