: అందరికీ ఆనందం... అర శాతం తగ్గిన వడ్డీ రేటు


అటు పారిశ్రామికవేత్తలకు, ఇటు బ్యాంకులతో పాటు రుణాలు తీసుకుని కిస్తీలు కడుతున్న భారతీయులందరికీ శుభవార్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును అర శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుని అన్ని వర్గాల వారినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. పావు శాతం వరకూ కీలక రేట్లు తగ్గుతాయని భావించిన పరిశ్రమ వర్గాలు ఈ నిర్ణయంతో ఆనందాన్ని వ్యక్తం చేశాయి. ఈ ఉదయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి సమీక్ష అనంతరం ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ భవిష్యత్ వృద్ధి రేటు మెరుగుదల కోసం వడ్డీ రేట్లు తగ్గిస్తున్నామని ప్రకటించారు. ప్రస్తుతం 7.25 శాతంగా ఉన్న రెపో రేటు ఇకపై 6.75 శాతానికి తగ్గనుంది. రివర్స్ రెపో రేటు 6.25 శాతంనుంచి 5.75 శాతానికి తగ్గనుంది. ఇదే సమయంలో నగదు నిల్వల నిష్పత్తిని మార్చబోవడం లేదని రాజన్ వివరించారు. 2016 నాటికి ద్రవ్యోల్బణం 5.8 శాతానికి చేరుతుందని అంచనా వేసిన ఆయన బ్యాంకులు తక్షణం ఈ వడ్డీ రేట్ల తగ్గింపు ప్రతిఫలాన్ని కస్టమర్లకు అందజేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News