: ఆప్ నేత సోమనాథ్ భారతిని అరెస్టు చేశాం: ఢిల్లీ పోలీసులు
ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమనాథ్ భారతిని అరెస్టు చేసినట్టు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిన్న సాయంత్రం ఆయన తనకు తానుగా లొంగిపోగా... వెంటనే ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నేడు ఆయనను కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. సోమనాథ్ భారతి గృహహింస, హత్యయత్నానికి పాల్పడ్డారంటూ ఆయన భార్య లిపిక కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టులు తిరస్కరించాయి. ఈ క్రమంలో ముందు పోలీసులకు లొంగిపోవాలని, తరువాత కోర్టుకు రావాలని సోమనాథ్ ను సుప్రీం ఆదేశించింది.