: యూవిక్ పేపరుతో తెలంగాణ రేషన్ కార్డులు!


ఎల్లుండి నుంచి తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ కానున్నాయి. వీటిని గతంలో మాదిరి లామినేషన్ రూపంలో కాకుండా, యూవిక్ పేపరుతో చేసిన కార్డులను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చించినా చిరగని, కాల్చినా కాలని ఈ కార్డుల తయారీ లామినేషన్ తో పోలిస్తే 60 శాతం కన్నా తక్కువ ధరలోనే పూర్తవుతుంది. ఒక్కో లామినేషన్ కార్డు తయారీకి రూ. 14 ఖర్చు అవుతుండగా, యూవిక్ పేపర్ తో తయారయ్యే కొత్త కార్డుకు రూ. 5 మించదని పౌర సరఫరాల శాఖ అధికారులు అంటున్నారు. దీనిపై వివరాల్లో మార్పులు కూడా సులువుగా చేసుకోవచ్చని, ఈ కార్డులు గులాబీ రంగులో ఉంటాయని వివరించారు. ఇప్పటికే కార్డులు తయారవుతున్నాయని, ఒకటవ తేదీ నుంచి వీటిని లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News