: మన స్లమ్ ఏరియా కుర్రాళ్లు సత్తా చాటారు!


అవును ...మన స్లమ్ ఏరియాల కుర్రాళ్లు సాకర్ లో సత్తా చాటారు. 'హోమ్ లెస్ సాకర్ వరల్డ్ కప్'ను భారత్ జట్టు గెలుచుకుంది. ఈ వరల్డ్ కప్ లో 48 దేశాలకు చెందిన 555 మంది ఆటగాళ్లతో కూడిన జట్లు పాల్గొన్నాయి. వివిధ దేశాల్లోని స్లమ్ ఏరియాలలో ఉండటానికి ఇల్లు కూడా లేని వీధి బాలలను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తారు. మన దేశంలోని 15 రాష్ట్రాలలో ప్రతిభ కనబరిచిన 32 మంది పిల్లలను ఎంపిక చేసి ఈ హోమ్ లెస్ సాకర్ వరల్డ్ కప్ కు స్లమ్ సాకర్ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణనిచ్చి ఆమ్ స్టర్ డామ్, నెదర్లాండ్స్ లో జరిగిన ఈ పోటీలకు పంపారు. ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఫిన్ లాండ్, బెల్జియం, ఇజ్రాయిల్, గ్రెనెడా ఇలా 12 దేశాలతో తలపడిన మన కుర్రాళ్లు టైటిల్ పోరులో పటిష్ఠమైన గ్రెనెడాను ఓడించి భారత కీర్తి పతాకను రెపరెపలాడించారు.

  • Loading...

More Telugu News