: మోదీ తల్లిపై కాంగ్రెస్ రీసెర్చ్ చేసిందట!


ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం కోసం తల్లిని కూడా వినియోగించుకుంటున్నారని కాంగ్రెస్ మండిపడింది. ప్రధాని మోదీ పదేపదే తన తల్లి చాలా కష్టపడిందని, తమను పెంచేందుకు ఇరుగుపొరుగు ఇళ్లలో పాచిపని కూడా చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆమె నిజంగా పాచిపని చేశారా? లేక మోదీ ప్రచారం చేసుకుంటున్నారా? అని పరిశోధన చేసింది. తమ పరిశోధనలో హీరాబెన్ పాచిపని చేసినట్టు నిర్ధారణ కాలేదని అన్నారు. తల్లి పాచిపని చేసిందని చెప్పి, మోదీ ఆమెను కూడా అవమానించారని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ మండిపడ్డారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మోదీ తల్లి విషయాన్ని కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News